UPDATED 13th JUNE 2020 SATURDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): తాజాగా విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో స్థానిక కెఎస్ఎన్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రాధాకృష్ణ నాయుడు శనివారం మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జూనియర్ ఇంటర్ లో ఎంపిసి నుంచి 470 మార్కులకు గాను 463 మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలోనే ద్వితీయ స్థానం సాధించారని అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం 265 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 246 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 233 మంది పరీక్షలకు హాజరుకాగా 210 మందితో తమ కళాశాల ఉత్తీర్ణత శాతం 93.1 శాతం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు.







