బాలలకు వేసవి ఆహ్లాదం గోడపత్రిక ఆవిష్కరణ

UPDATED 12th APRIL 2018 THURSDAY 7:00 PM

పెద్దాపురం: తల్లిదండ్రులు తమ పిల్లలను విజ్ఞానవంతులుగా తయారు చేయడానికి పుస్తక పఠనం ఒకటే మార్గమని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో పాండవుల మెట్ట వద్ద అతిరాత్ర యాగశాలలో స్థానిక ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయం ద్వారా నిర్వహిస్తున్న బాలలకు వేసవి ఆహ్లాదం కార్యక్రమ గోడపత్రికను మున్సిపల్ చైర్మన్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహిస్తున్న బాలలకు వేసవి ఆహ్లాదం కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల విద్యార్థులను గ్రంథాలయాలకు పంపించాలని, దీని వల్ల వారు భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు కలుగుతుందని ఆయన అన్నారు. గ్రేడ్-1 లైబ్రేరియన్ ఎస్. సాయి సత్యనారాయణ మాట్లాడుతూ 25వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు 10 నుండి 15 సంవత్సరాల విద్యార్థులకు మున్సిపల్ ఆఫీసు వెనుక గాంధీ పార్కులో ఉన్న ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు పుస్తకాలు చదవడం, ఉ 10-10 నుంచి 1 గం. వరకు కథలు వినడం, 11 నుంచి 12 గంటలు వరకు చిత్రలేఖనం, పాటలు, ఉపన్యాసం, స్పోకెన్ ఇంగ్లీషు, సంగీతం మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు విజయ్, యాగశాల పర్యవేక్షకుడు శర్మ, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us