UPDATED 17th APRIL 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట:104 వాహనాలతోనే ఉద్యోగులకు ప్రాణహాని కలుగుతుందని, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం 104 ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 వాహనాలలో వాహనాలకు సంబంధించిన ఆర్.సి, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం వలన ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం కూడా రాని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.







