UPDATED 9th OCTOBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి 30 మంది గర్భిణీలను పరీక్షించి గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం గురించి వివరించి ఉచితంగా మందులు అందచేశారు. అవసరమైన వారికి స్కానింగ్ చేసి పరీక్షల్లో వెల్లడయిన ఫలితాలు ఆధారంగా హైరిస్క్ కేసులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఏసుదాసు, తదితరులు పాల్గొన్నారు.







