రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఐటీడీఏ పీవో ప్రవీణ్ ప్రవీణ్ ఆదిత్య

మారేడుమిల్లి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021 : ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు రహదారులు చాలా ముఖ్యమైనవని, అందుకు రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడి వలస పంచాయితీ గొందివాడ, నెల్లూరు, సున్నంపాడు పంచాయతీ నూరుపూడి రోడ్లు, వంతెనలు, కల్వర్టులు నిర్మాణానికి సంబంధించి ఆయన బుధవారం ఆయా ప్రాంతలని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారేడుమిల్లి జియం వలస పంచాయతీ మారుమూల గ్రామాలైన గొందివాడ, నెల్లూరు గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గొందివాడ నుంచి నెల్లూరు వరకు 4.62 కిలోమీటర్ల మెటల్ రోడ్డుకు మధ్యలో ఏడు కల్వర్టులు, రెండు వంతెనలు, ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నెల్లూరు గ్రామంలో ప్రతి ఇంటికి కరెంటు, త్రాగునీరు అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పీవో ఆదేశించారు. గొందివాడ, నెల్లూరు గ్రామాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గొందివాడ, నెల్లూరు గ్రామాల మధ్యలో గ్రామస్థులే కల్వర్టు పనులు చేసుకుంటే ఆ గ్రామాల వారికి కల్వర్టు పనులు ఇవ్వడం జరుగుతుందన్నారు. గొందివాడ గ్రామంలో కమ్యూనిటి భవనానికి విద్యుత్ ఏర్పాటుచేసి ఈ కమ్యూనిటీ భవనంలో జాప్రా గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చని, అందుకు వెంటనే విద్యుత్ ఈ కమ్యూనిటి భవనానికి ఏర్పాటు చేయాలన్నారు. నెల్లూరు గ్రామానికి ఫైబర్ నెట్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గొందివాడ గ్రామంలో స్కూల్ భవనం ఏర్పాటు చేయాలని అదేవిధంగా జిసీసీ సబ్ డిపో ఏర్పాటు చేయాలని గ్రామస్థులు పీవో దృష్టికి తీసుకురాగా నాడు -నేడు ద్వారా స్కూల్ భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, అదేవిధంగా ఈ గ్రామాలకు పీడీఎస్ బియ్యం, బియ్యం వ్యాన్లు ఈ రోడ్లు పూర్తయిన వెంటనే ఈ గ్రామాలకు అంబులెన్సులు, పిడిఎస్. వాహనాలు రావడానికి సులభతరం అవుతుందని, అందుకు ఈ రోడ్లపై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా మారేడుమిల్లి మండలం సున్నంపాడు గ్రామం సమీపంలో నూరుపూడి వెళ్లే రోడ్డు మధ్యలో కాలువపై వంతెన ఏర్పాటుచేసేందుకు సబ్ డీఎఫ్వో నిషాకుమారి 5.06 కిలోమీటర్లకు బీటీ రోడ్డు, సీసీ రోడ్డు కల్వర్టు పనులు చేసేందుకు పీవో, సబ్ డీయఫ్వో కాలువను పరిశీలించారు. ఈ రోడ్డుకు ఫారెస్ట్ క్లియరెన్సు కోసం సంబంధిత అధికారులతో సంప్రదించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంల తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో వివేక్, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ పద్మనాభం, పంచాయతీరాజ డీఈలు దుర్గాప్రసాద్, జి. ధర్మరాజు, ఏఈలు భాను, శైలజ, మురళీకృష్ణ, జి.ఎం. వలస సర్పంచ్ కారం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us