విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: విద్యార్థి జీవితంలో పాఠశాలలో గడిపిన అయిదేళ్లు అత్యంత ప్రాముఖ్యమని, జీవితంలో మంచి పౌరులుగా ఎదగాలని బచ్చుఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయి రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ, పాఠశాల వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ఆహ్వానితులుగా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్ సప్పా గంగా భవాని, వైస్ చైర్మన్ సిద్దిరెడ్డి సూర్యనారాయణ మూర్తి హాజరై  పదవ తరగతి పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలని నూరుశాతం ఉత్తీరత ఉత్తీర్ణతతో పాటు అధిక 10 /10 జి.పి.ఎ సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలోని సృజనాత్మకతను అద్దం పట్టాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి.వి.వి. సత్యనారాయణ, ఎ. శ్రీవల్లి, ఎవిఎల్ కుమారి, కె. అరుణ, రాజేంద్ర కుమార్, బి. శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us