ప్రతీ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలి

UPDATED 14th JUNE 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: ప్రతీ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) సిఈవో కృష్ణమోహన్ అన్నారు. స్థానిక టిటిడిసిలో కార్యాలయంలో డీఆర్డీఏ పిడి ఎస్. మల్లిబాబు ఆధ్వర్యంలో మహిళా సంఘాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ మహిళా సంఘంలోని ప్రతీ సభ్యురాలు మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని అన్నారు. ప్రతీ సంఘానికి రూ. ఐదు లక్షల రుణాలు, మండల సమాఖ్యకు రూ. కోటి రూపాయలు ఇస్తారని, వ్యాపారం సామర్ధ్యానికి అవసరమైన శిక్షణ కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిడిలు శ్రీనివాస కుమార్, రవికాంత్, ఎపిఎంలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us