నవంబర్ 18 న ఆదిత్యలో ఫార్మా ఫెరింజర్ - 2 కె 17 జాతీయ సదస్సు

UPDATED 16th NOVEMBER 2017 THURSDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో  ఈ నెల 18 న జాతీయ ఫార్మసీ వారోత్సవాలలో భాగంగా ఆదిత్య ఫార్మసీ కళాశాలల ఆధ్వర్యంలో "ఫార్మా ఫెరింజర్-2 కె 17 " పేరిట జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్  చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సి.ఎస్.ఆర్.ఐ. ప్రిన్సిపాల్ సైంటిస్ట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) కు చెందిన డాక్టర్ శిష్ట్లా రామకృష్ణ హాజరుకానున్నారని, ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఫార్మసీ కళాశాలలకు ఆహ్వాన పత్రాలు పంపించామన్నారు. పేపర్, పోస్టర్ ప్రెజెంటేషన్స్ కు 1200 మంది విద్యార్థులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వివిధ కళాశాలలకు చెందిన ప్రొఫెసర్స్, సైంటిస్ట్స్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి  ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివాకర్, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.                   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us