UPDATED 26th JULY 2019 FRIDAY 8:00 PM
పెద్దాపురం: భక్తులపాలిట కొంగుబంగారంలా విరాజిల్లుతున్న పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ అమ్మ వారిని పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు శుక్రవారం దర్శించుకున్నారు. మరిడమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, ఉత్సవ కమిటీ సభ్యులు, వేద పండితులు చిట్టెం హరిగోపాల్ శర్మ బృందం ఆలయ మర్యాదల ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భగుడిలో మూలవిరాట్టును ఆర్డీవో దర్శించుకుని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మ వారి తీర్థప్రసాదాలను ఆయనకు అందచేశారు.







