UPDATED 9th OCTOBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: కేర్ ఫర్ నీడ్ సంస్థ సౌజన్యంతో పిఠాపురం సిఎంసి ఆసుపత్రి సహకారంతో స్థానిక రాజీవ్ గృహకల్ప వద్ద మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా మానవహక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ప్రారంభించారు. ఈ శిబిరంలో 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 20 మందిని ఆపరేషన్ కు ఎంపిక చేసినట్లు పాస్టర్ పి. ఆనందబాబు తెలిపారు.







