దేశాభివృద్ధి సివిల్ ఇంజినీర్లతోనే సాధ్యం

UPDATED 7th MARCH 2018 WEDNESDAY 10:00 PM

గండేపల్లి: భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా మార్చే శక్తి సివిల్ ఇంజినీర్లతోనే సాధ్యమని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల జరుగుతున్న జాతీయ సాంకేతిక సదస్సు స్ట్రైడ్స్ 2కె18 రెండవ రోజు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఎలేవేర్ 2కె18, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఎక్సల్ట్ 2కె18 కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా డాక్టర్ బాదం సుందరరావు, సుందర్ అసోసియేట్స్ అర్చిటెక్చరల్ ఇంజనీర్స్ అండ్ కన్సల్టింగ్ ఇంజనీర్స్, కాకినాడ, రిలయన్స్ పవర్ లిమిటెడ్ స్టేషన్ డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి. ద్వారకానాధ్ పాల్గొన్నారు. ఎక్సల్ట్-2కె18, ఎలేవేర్-2కె18  కార్యక్రమాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ తమ విద్యార్థులను భావిభారతః ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ గా తయారుకావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది ఒక చక్కని వేదికని అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే శక్తి సివిల్ ఇంజినీర్లతోనే సాధ్యమని ఆయన అన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ సుందరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో నిర్మాణాలన్నీ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా జ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రయోగాత్మక పరివర్తన కలిగి ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూ ప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ గా గుర్తించిందని, ఇంజినీర్లు అందరూ పర్యావరణానికి హితం కలిగే విధానాలను అవలంభించాలని అన్నారు. "సే గ్రీన్ - గో గ్రీన్" అనే నినాదంతో డాక్టర్ సుందరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఎలేవేర్-2కె18 సావనీర్ ను ఆవిష్కరించారు. ఎలేవేర్-2కె18 కార్యక్రమంలో 36 పేపర్ ప్రెజంటేషన్స్,18 పోస్టర్ ప్రెజంటేషన్స్, 36 ప్రాజెక్ట్ ప్రెజంటేషన్స్, 18 టెక్నికల్ క్విజ్ టీములు ఎంపికైనట్లు కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఆర్.వి.ఎస్. శివ రామకృష్ణ తెలిపారు. ఎక్సల్ట్-2కె18, సావనీర్ ను ద్వారకానాధ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 378 మంది వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారని, వాటిలో 25 పేపర్ ప్రెజంటేషన్స్, 50 పోస్టర్ ప్రెజంటేషన్స్, 48 ప్రాజెక్ట్ ప్రెజంటేషన్స్, టెక్నికల్ క్విజ్ 33 టీములు ఎంపికైనట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us