అమర జవాన్లకు ఘన నివాళులు

UPDATED 18th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్థానిక శ్రీ భీమేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ భారత సైనికులపై ఉగ్రవాద ముఠా జరిపిన దాడి అత్యంత హేయమైన, పిరికిపంద చర్యని, శాంతియుతంగా ఏదైనా సాధించవచ్చని, ఈ తరహా హింసాత్మక దాడులు అమానుషం అన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సైనికులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. విజయ భాస్కరరెడ్డి, చిత్తులూరి వీర్రాజు, ఏ. అన్వర్ కుమార్, ఆదినారాయణరెడ్డి, కటకం గంగబాబు, మద్దాల శ్రీను, మందిరాల శివకృష్ణ, రామలక్ష్మి, గుండు శంకర్రావు, పెన్నాడ జగన్నాథం, కానుబొయిన విజయకృష్ణ, రాఘవేంద్రరావు, సేపేని సురేష్, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us