* జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి
UPDATED 23rd JULY 2020 THURSDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలో ఉన్న కోవిడ్ ఆసుపత్రులను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కె.యస్. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ ఆసుపత్రుల సూపరిటెండెంట్లతో జూమ్ యాప్ ద్వారా గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, ఆక్సిజన్, వెంటిలేటర్ల వినియోగం, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్, తదితర వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పల్మనాలజిస్టులు, ఎనస్థీషియా, జనరల్ ఫిజిషియన్లు, ఎంబిబిఎస్ వైద్యులు, పారా మెడికల్ సిబ్బందితోపాటు వెంటిలేటర్ల అవసరం ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి స్పెషల్ సెక్రెటరీకి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్లు కీర్తి చేకూరి (డి), జి. రాజకుమారి, (డబ్ల్యు), కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. మణిరత్నకిషోర్, జిఎస్ఎల్ (రాజానగరం), డిసిహెచ్ (రాజమహేంద్రవరం), కిమ్స్ (అమలాపురం), హోప్ ఇంటర్నేషనల్ (కాకినాడ), బొల్లినేని (రాజమహేంద్రవరం) హాస్పిటల్స్ సూపరిండెంట్లు పాల్గొన్నారు.







