* ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు
* పెద్దాపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో వసంత రాయుడు
UPDATED 3rd JULY 2019 WEDNESDAY 6:00 PM
పెద్దాపురం: అధికారులు పారదర్శకత పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. స్థానిక మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా పెద్దాపురం ఆర్డీవో వసంతరాయుడు మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి సమక్షంలో బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అలాగే మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బిల్డింగ్ ప్లానులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనెల ఎనిమిదవ తేదీన వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పింఛన్ల పంపిణీని పండగ వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, డీఈఈ రమేష్ బాబు, టిపిఎస్ రాణి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







