UPDATED 24th NOVEMBER 2019 SUNDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 71వ ఎన్.సి.సి ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం సిహెచ్ సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యా శాఖాధికారిణి సజ్జా విజయలక్ష్మీదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ అచ్చిరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు క్యాడెట్లతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం గ్రామంలో స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఎన్ సి.సి అధికారి జి.వి.వి సత్యన్నారాయణ ఆధ్వర్యంలో సుమారు 300 గుడ్డ సంచులను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో విజయలక్ష్మీదేవి, ఎన్.సి.సి అధికారి సత్యన్నారాయణ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 1948లో ఆవిర్భవించిన ఎన్.సి.సి దేశమంతటా సేవలందిస్తూ, విద్యార్థుల్లో క్రమశిక్షణ, జాతీయ భావం, ఏకత్వ భావాలను పెంపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంఠం శ్రీనివాస్, యు. సత్యనారాయణ, శ్రీరామచంద్రమూర్తి, సిద్ధూ, నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.







