వృద్ధాశ్రమానికి ఆదిత్య విద్యార్థుల వితరణ

UPDATED 27th NOVEMBER 2018 TUESDAY 7:00 PM

గండేపల్లి:  గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎన్ఎస్ఎస్ విభాగం  ఆధ్వర్యంలో కాకినాడ రెడ్ క్రాస్ హోం ఫర్ సీనియర్ సిటిజన్ వృద్ధాశ్రమానికి బియ్యం, మినపప్పు, చక్కెర, కందిపప్పు, ఇడ్లీనూక తదితర నిత్యావసర వస్తువులను మంగళవారం అందచేశారు. ఈ సంధర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రోజువారీ ఒక రూపాయి విరాళ నిధితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఒక రూపాయి విరాళ నిధితో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తి అందిస్తున్న ఎన్ఎస్ఎస్ విభాగాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు జె. బాలామోహనరాజు, ఎం. సోమిరెడ్డి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us