UPDATED 12th AUGUST 2018 SUNDAY 8:00 PM
పెద్దాపురం : పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ దేవస్థానంలో అమ్మవారి జన్మనక్షత్రం పురస్కరించుకుని వేదపండితులు చిట్టెం హరిగోపాలశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు ఎన్.వి. శాస్త్రి, అవధాని, ఐ.వి. ప్రసాద్ శర్మ, దేవస్థానం చైర్మన్ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్. పుష్పనాథం, ఎక్స్ అఫిషియో సభ్యుడు రాయి విజయ్ కుమార్, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది లక్ష్మణరావు, శివ, నాని, లోవ, గౌరి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.







