ప్రగతిలో ముగిసిన స్టాటిస్టిక్స్ విత్ ఆర్-ప్రోగ్రామింగ్ సదస్సు

UPDATED 23rd JUNE 2018 SATURDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో వారం రోజులుగా జరుగుతున్న స్టాటిస్టిక్స్ విత్ ఆర్-ప్రోగ్రామింగ్ సదస్సు శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ జి. సత్యమూర్తి  హాజరై మాట్లాడుతూ స్ట్రెస్ మేనేజ్ మెంట్, స్ట్రెస్ ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలు గురించి వివరించారు. నేటి ప్రపంచంలో విజయం సాధించాలంటే ప్రతీ ఒక్కరూ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ టి. సత్యనారాయణ మాట్లాడూతూ ఎఐసిటిఇ, ఐ.ఎస్.టి.ఇ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన కళాశాల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికేట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us