కార్పోరేట్ కళాశాలల్లో ఇంటర్‌ చదివేందుకు ఉచిత అవకాశం

UPDATED 16th MAY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: 2019–20 విద్యా సంవత్సరానికి ప్రతిభావంతులైన పేద విద్యార్థులు కార్పోరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ద్వారా శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంఈవో వైవి శివరామకృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక విలేఖరులతో ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 2019 పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ గ్రేడ్‌ పాయింట్స్ సాధించిన విద్యార్థులు ఇంటర్‌ విద్యను కార్పోరేట్ కళాశాలల్లో చదివేందుకు ఈ ‘కార్పొరేట్‌ కాలేజ్’ స్కీమ్‌లో అవకాశం ఉందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌ రెండేళ్ల చదువు, వసతికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, పురపాలక, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, నవోదయ విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ వసతి గృహాల్లో ఈ ఏడాది పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పదవ తరగతి విద్యను అభ్యసించి, 2019 పదవ తరగతి ఫలితాల్లో కనీసం జీపీఏ 7 పాయింట్స్ సాధించి ఉండాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించి ఉండరాదని, మిగిలిన వర్గాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.లక్షకు మించరాదని, ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు http://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో కార్పోరేట్ అప్లికేషన్స్‌ అనే కాలం క్లిక్‌ చేసి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us