UPDATED 25th JUNE 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 10/ 10 జిపిఎ, 9 జిపిఎ పైన సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మోహన్ ఇండస్ట్రీస్ అధినేత గ్రంధి వెంకటేశ్వరరావు వారి తండ్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు సోమవారం అందచేశారు. అలాగే పాఠశాల హిందీ పండితురాలు కర్రా నాగమణి హిందీలో 10/ 10 సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు రూ. వెయ్యి నగదు ప్రోత్సాహాన్ని అందచేశారు. అలాగే 6,7,8,9, తరగతుల్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన విద్యార్థినీ, విద్యార్థులకు కూడా నగదు ప్రోత్సాహంతో పాటు మెడల్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం యు. సత్యన్నారాయణ, దాతలు గ్రంధి వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు కంచర్ల సాయిబాబు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు చీమలకొండ సత్యన్నారాయణమూర్తి, కర్రా నాగమణి, గొడత రాజేశ్వరి, పిఇటి తాళ్ళూరి వైకుంఠం, జాన్ కెనడీ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







