UPDATED 6th FEBRUARY 2020 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): అర్హత గల ప్రతీ ఒక్కరికీ పెన్షన్లు మంజూరవుతాయని, ఏఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ మాచగిరి ఏసుబాబు అధ్యక్షతన పింఛన్లపై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం సామర్లకోట పట్టణ పరిధిలో 5627 పింఛన్లకుగాను అనర్హుల లిస్టులో 708 పింఛన్లు పరిశీలనలో ఉన్నాయని, ఈ 708 పింఛన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ పింఛన్లు పరిశీలనలో అనర్హత కారణాలేమిటి అనే విషయాలను వాలంటీర్లు రీ వెరిఫికేషన్ చేస్తారని, ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రజలు వాలంటీర్లకు సహకరించాలని కోరారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ. పది వేలు పింఛన్లు ఆయన అందజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ డిఇ సిహెచ్ రామారావు, పార్టీ నాయకులు దవులూరి సుబ్బారావు, ఆవాల లక్ష్మీనారాయణ, గోలి అప్పారావు చౌదరి, ఊబా జాన్ మోజస్, మద్దాల శ్రీను, కాళ్ల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, చిట్టిమాని శ్రీనివాసరావు, పాగా సురేష్ కుమార్, మహమ్మద్ ఉబేదుల్లా, మున్సిపల్ లైజన్ ఇంచార్జ్ కొండబాబు, శేషు, తదితరులు పాల్గొన్నారు.







