UPDATED 20th SEPTEMBER 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పలు అవగాహనా కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జిల్లా గ్రీన్ కోర్ సమన్వయ కర్త కేసరి శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కమీషనర్ చేతుల మీదుగా అవగాహనా కరపత్రాలను ఆవిష్కరించారు. ప్లాస్టిక్ భూతాల వేషధారణ, చెట్టు వేషధారణలో విద్యార్ధులు అలరించారు. ఈ కార్యక్రమంలో డిఇ రామారావు, మెజీషియన్ వి.ఎస్.వి. రమణమూర్తి, టి. వైకుంఠం ఏ.ఎల్.వి. కుమారి, కె. శ్రీనివాస్, జి. గోవిందు, వి. రాజు, శ్రీవల్లి, డి.వి.ఆర్.ఎం.వల్లి, భద్రావతి, శేఖరం, తదితరులు పాల్గొన్నారు.







