మహిళల విద్యాభివృద్ధికి నిరంతరం కృషి

* దివిలి కిట్స్ లో బిఫార్మసీ మహిళా కళాశాల ప్రారంభం 
* జిల్లాలోనే ప్రప్రథమంగా ఫార్మసీ మహిళా కళాశాల ఏర్పాటు 
* కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు

UPDATED 17th MAY 2019 FRIDAY 5:00 PM

పెద్దాపురం: మహిళల విద్యాభివృద్ధికి తమ కళాశాల నిరంతరం కృషి చేస్తుందని దివిలి కిట్స్ ఇంజనీరింగ్  కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2008వ సంవత్సరంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించే లక్ష్యంతో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగిందని, నాటి నుంచి తమ కళాశాల విజయపథాన అనేక మైలురాళ్లను అధిగమించిందని తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి జిల్లాలోనే ప్రప్రథమంగా మహిళల కోసం బీఫార్మసీ కళాశాల "కిట్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫర్ ఉమెన్" ప్రారంభిస్తున్నామని అన్నారు. తమ కళాశాల చరిత్రలో మరో ఆణిముత్యంలా ఫార్మసీ కళాశాల ఆవిర్భవించడం ఖాయమని అన్నారు. ఇంటర్ ఎంపీసీ/బైపీసీలతో ఎంసెట్ పాస్ అయిన విద్యార్థినులు బిఫార్మసీలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. 100 సీట్లతో బిఫార్మసీలో ప్రవేశాలకు ఈ ఏడాది ఏఐసిటిఈ-ఢిల్లీ అనుమతులు మంజూరు చేసిందని, జెఎన్టీయుకె-కాకినాడ అనుబంధంగా ఫార్మసీ కళాశాల పనిచేస్తుందని పేర్కొన్నారు. ఫార్మసీ కోర్సులకు సంబంధించి అధునాతన లాబరేటరీలు,డిజిటల్ క్లాస్ రూములు, నిష్ణాతులైన అధ్యాపక సిబ్బంది, జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులకు రవాణా సౌలభ్యం, కళాశాలకు అనుబంధంగా డిపార్ట్ మెంటల్ హాస్టళ్లు, ముఖ్యంగా మహిళలకు పూర్తి భద్రతతో కూడిన సువిశాల ప్రాంగణం తమ కళాశాల సొంతమని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఈ. సర్వరామేశ్వరుడు, ఏవో కెఆర్ సందీప్, ఈవో ఎన్. జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, తదితరులు పాల్గొన్నారు.                

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us