నైపుణ్యంతోనే క్రీడల్లో విజయాలు వరిస్తాయి

UPDATED 13th NOVEMBER 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): నైపుణ్యంతోనే క్రీడల్లో విజయాలు వరిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. మాజీ కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్ అధ్యక్షతన బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గల క్రీడావికాస కేంద్రంలో క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దొరబాబు మాట్లాడుతూ సామర్లకోట పట్టణానికి చెందిన ఎబివైఆర్ సి కబడ్డీ జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రెండవ స్థానం సాధించి బహుమతులు సాధించడం అభినందనీయమని అన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాపోటీల్లో రాణించి సామర్లకోటకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులు సహకారం అందించేందుకు ఎప్పుడూ తాము ముందు ఉంటామని ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించాలి. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మేడిశెట్టి బుజ్జి, కబడ్డీ కోచ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us