UPDATED 27th DECEMBER 2019 FRIDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం చంద్రపాలెం, ఉండురు గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం సారా బట్టీలపై దాడులు నిర్వహించి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కాకినాడ నార్త్ స్టేషన్ సిఐ జి. వెంకటలక్ష్మి తెలిపారు. వారి వద్ద నుంచి 100 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని, కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ దాడుల్లో కాకినాడ నార్త్ స్టేషన్ ఎస్ఐ జి.వి. నరసింగరావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







