వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

UPDATED 2nd OCTOBER 2018 TUESDAY 7:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాల  ఎంసిఏ విభాగం విద్యార్థులు మంగళవారం వృద్ధులకు 60 దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఎంసీఏ విభాగాధిపతి ఆర్. తమిళ్ కోడి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బొమ్మూరులోని ఇవాంజలిన్స్ హెల్పింగ్ హాండ్స్ ఆసుపత్రిలోని వృద్ధులకు రూ.ఎనిమిది వేల ఐదు వందలు విలువ చేసే ఈ దుప్పట్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఏ విభాగాధిపతి ఆర్. తమిళ్ కోడి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పి. శివప్రసాద్, కె. ప్రవీణ్ కుమార్, సద్దాం హుస్సేన్, ఎంసీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us