* మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు
* ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
UPDATED 21st NOVEMBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): భవిష్యత్ తరాలను తీర్చిదిద్దటంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మున్సిపల్ కమీషనర్ ఏసుబాబు మాట్లాడుతూ ఉత్తమ సమాజ స్థాపన గ్రంథాలయాల అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనం ఆవశ్యకమని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి ఎంతో విలువైన పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోవాలని అన్నారు. అనంతరం వారోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయి రామకృష్ణ, యు. సత్యన్నారాయణ, గ్రంధాలయ సిబ్బంది ఎం. శ్రీనివాస్, బుల్లియ్య, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







