UPDATED 23rd JUNE 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం పొలంలో ఆదివారం ఉదయం పిడుగు పడి వ్యవసాయ కూలీ కొండేపూడి అప్పలరాజు (45) మృతి చెందాడు. అప్పలరాజు పొలంలో పనులు చేస్తుండగా భారీగా కురిసిన వర్షం కారణంగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో పంట పొలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట పోలీసులు తెలిపారు.







