క్రిస్మస్‌ అంటే శాంతికి చిహ్నం

* శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ 
* శ్రీ ప్రకాష్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

UPDATED 24th DECEMBER 2018 MONDAY 6:30 PM

పెద్దాపురం: క్రిస్మస్‌ అంటే శాంతికి చిహ్నమని, లోక రక్షకుడుగా కరుణామయుడు దివి నుంచి భువికి వచ్చిన శుభ సందర్భమే క్రిస్మస్ పండుగ అని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ ప్రకాష్ అన్నారు. స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని   క్రిస్మస్ సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ క్రిస్మస్‌ అంటే వెలుగులని దానిని పది మందికి పంచడమే ఈ పండగకు పరమార్ధమని అన్నారు. ఏసుక్రీస్తు ఆగమనమే ఒక దివ్య సందేశమని, విశ్వమానవ హితానికి శుభ సమయమని అన్నారు. ఏసుక్రీస్తు ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహోన్నతుడని, లోక రక్షకుడుకైన ఏసుక్రీస్తు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని తెలిపారు. సర్వమానవ సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని క్రీస్తు శతాబ్దాల క్రితమే ప్రబోధించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జనన విశేషాలకు సంబంధించి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అను అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు వేల ఖాళీ వాటర్ బాటిళ్లతో విద్యార్థులు రూపొందించిన 25 అడుగుల క్రిస్మస్ ట్రీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులు శాంతాక్లాజ్ వేషధారణలో విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సివోవో లెఫ్టినెంట్ కమాండర్ కె.ఎస్. రావు, వైస్ ప్రిన్సిపాల్ నీరా ప్రసాద్, తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.         
 
  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us