UPDATED 18th JULY 2017 TUESDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో నెల్సన్ మండేలా 99 వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణా రెడ్డి మాట్లాడుతూ దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా శాంతి కాముకుడని ఆ దేశ ప్రజల హక్కులకోసం ఎంతగానో కృషి చేశారని, అలాగే ప్రపంచ శాంతి కోసం జీవితాంతం పోరాటం చేశారన్నారు. ఆయన జీవితం సర్వ మానవాళికి ఆదర్శనీయమన్నారు. అనంతరం బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ మండేలా ప్రపంచానికి చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు. విద్యార్థులంతా ఆయన జీవితం నుంచి సాధించాల్సినవి, నేర్చుకోవాల్సినవి అనేకం ఉన్నాయన్నారు. అలాగే ఆయన జీవిత చరిత్ర పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







