UPDATED 3rd JULY 2020 FRIDAY 7:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): చిన్న పరిశ్రమలు స్థాపించదలచిన ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టర్ కార్యాలయం నుంచి జూమ్ యాప్ ద్వారా ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించే ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకు 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రీస్టార్ట్ పరిశ్రమలకు మూడు నెలలపాటు విద్యుత్ బకాయిలను రీఇంబర్సెమెంట్ చేయడం జరిగిందని, రీస్టార్ట్ కంపెనీలకు పెట్టుబడి నిధి రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.







