ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో లీడ్ ఇండియా -2020

UPDATED 26th JULY 2018 THURSDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో  లీడ్ ఇండియా - 2020 అనే కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వక్త, సాఫ్ట్  స్కిల్స్ అభివృద్ధిపై అవగాహన కల్పించే ఆర్. ఒమాజీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం 2004వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారని, 2020 నాటికి భారతదేశం ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలనే సంకల్పంతో ప్రారంభించారని అన్నారు. దేశం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవాలని కలాం కలలు కని వాటిలో విద్యార్థులను భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇంతవరకు 14లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారని తెలిపారు. విద్యార్థులు తాము ఎంచుకొన్న మార్గంలో నిష్ణాతులుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకొంటూనే దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. డైరెక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ కలాం  స్థాపించిన లీడ్ ఇండియా - 2020  కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, 21వ శతాబ్దంలో సమాచార నైపుణ్యాలను, ఆంగ్లభాషపై పరిజ్ఞానం పెంపొందించుకున్నప్పుడే విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోగలరని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ అబ్దుల్ కలాం దేశాభివృద్ధిలో విద్యార్థులను భాగస్వాములను చేయాలనే ధ్యేయంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని ప్రపంచ దేశాలలో మన భారతదేశాన్ని నిలపడం ద్వారా ఆయనకు మనం ఘనమైన నివాళి అందించినట్లు అవుతుందని  అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేరణా శిక్షణ తరగతుల నిర్వాహకులు ఎ. అనీష్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు .
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us