వార్డుల పునర్విభజన తీరుపై ఫిర్యాదు

UPDATED 11th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : సామర్లకోట మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన వార్డుల పునర్విభజన తీరుపై ప్రజలు అయోమయానికి గురవుతున్నారని జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, కార్యదర్శి కుంచే నానిబాబు పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబుకు వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సామర్లకోట పట్టణంలో గల 30 వార్డులను పునర్విభజన ప్రక్రియ పేరుతో చిన్నాభిన్నంగా విడదీయడం వల్ల ప్రజలు ప్రజలు అయోమయానికి గురవుతున్నారని, తక్షణం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విభజన ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. అందరికీ ఆమోదమైన పద్దతిలో వార్డుల విభజన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల సంఘం నాయకులు జుత్తుక అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us