సా మాం పాతు సరస్వతీ! భగవతీ!!

UPDATED 27th SEPTEMBER 2017 WEDNESDAY 10:00 PM

రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో దసరా శరన్నవరాత్రి  ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ సప్తమి బుధవారం మూలా నక్షత్రం ఏడవరోజు విజయదుర్గా అమ్మవారు శ్రీ మహా సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీదేవి అవతారాన్ని పురస్కరించుకుని వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులనుద్దేశించి  పీఠాధిపతి గాడ్  ప్రసంగిస్తూ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ నక్షత్రం సరస్వతీదేవి జన్మనక్షత్రం కావడంతో ఈ రోజు ఎంతో పవిత్రమైనదన్నారు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు వర్ణించాయని, ఆసనంగా శ్వేత పద్మాన్ని అధిష్టించి, వీణ, దండ, కమండలాలు, అక్షరమాల ధరించి అభయముద్రతో అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుందన్నారు. త్రిశక్తుల్లో సరస్వతి మూడో శక్తి స్వరూపమని, ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయన్నారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు రెడ్డప్ప దవేజీ, కేశాప్రగడ సత్యనారాయణల ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చక్రవర్తుల మాధవాచార్యులు, చీమలకొండ వీరావధాని, తోలేటి నాగేంద్ర శర్మ, చీమలకొండ శ్రీనివాస్, పీఠం అడ్మినిస్ట్రేటర్ వి.వి. బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి) తదితరులు పాల్గొన్నారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us