PM Modi : ఇది ప్రగతిశీల బడ్జెట్ : మోదీ

Updated 1 February 2022 Tuesday 06:50 PM

న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ప్రజలకు స్నేహపూర్వకమైనది, ప్రగతిశీలమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాలకు నూతన అవకాశాలను తీసుకొచ్చే బడ్జెట్ ఇది అని తెలిపారు.

వందేళ్లలో వచ్చిన భయానక విపత్తు కోవిడ్-19 మహమ్మారి సమయంలో అభివృద్ధి పట్ల నూతన ఆత్మవిశ్వాసాన్ని ఈ బడ్జెట్ తీసుకొచ్చిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఈ బడ్జెట్ సామాన్యులకు అనేక నూతన అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు.

పేదల సంక్షేమం ఈ బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన అంశమని చెప్పారు. ప్రతి పేద వ్యక్తికి తప్పనిసరిగా ఓ పక్కా గృహం, కొళాయి నీరు, మరుగుదొడ్డి, గ్యాస్ సదుపాయం ఉండాలన్నారు. ఈ బడ్జెట్‌లో వీటన్నిటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారని తెలిపారు.

అదే సమయంలో ఆధునిక ఇంటర్నట్ కనెక్టివిటీపై సమానంగా శ్రద్ధ చూపించారని చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన వారికి మరింత సేవ చేయాలనే తపనను, దృఢనిశ్చయాన్ని బీజేపీలో పెంచిందని చెప్పారు.

పర్వతమాల స్కీమ్ మన దేశంలో మొదటిసారి అమలవుతోందన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం వల్ల పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థ నిర్మితమవుతోందని చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us