UPDATED 25th SEPTEMBER 2017 MONDAY 6:00 PM
పెద్దాపురం: సమాజాభివృద్దిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో సంఘ రాష్ట్ర కార్యదర్శి నవీన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ పెద్దాపురం డివిజన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై సోమవారం మాట్లాడారు. సమాజాన్ని, ప్రజలను చైతన్యవంతం చేయగలిగిన శక్తి జర్నలిస్టులకే ఉందన్నారు. జగ్గంపేట ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వారికి అందాల్సిన అన్ని సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఏపీడబ్యుజేఎఫ్ పది వసంతాలు పూర్తిచేసుకుని 11 వ వసంతంలోకి అడుగుపెట్టిన సంధర్భంగా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు. అలాగే రాష్ట్ర నాయకులు నవీన్, ఆంజనేయులు,అమరయ్య జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడారు. అనంతరం పెద్దాపురం డివిజన్, నియోజకవర్గ సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు, వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు, ప్రత్తిపాడు వైసీపీ నాయకుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజసూరిబాబురాజు, ఎఎంసి చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, సమాచార శాఖ డిడి ఫ్రాన్సిస్, సంఘ సభ్యులు సాంబశివరావు, ఎలియా, అధికారి, ఎస్ కె మున్ని, శ్రీధర్, సామర్లకోట ఎంపీపీ మార్త, జడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి, పెద్దాపురం డివిజన్ పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.







