మోడ్రన్ డాన్స్ లో రాణిస్తున్న మహారాణి కళాశాల విద్యార్థిని

UPDATED 27th OCTOBER 2017 FRIDAY 7:00 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక మహారాణి కళాశాలలో చదువుతున్న జి. విష్ణు మణికంఠని మోడ్రన్ డాన్స్ లో విశేష ప్రతిభ కనబరుస్తోంది. కాకినాడ అంబేద్కర్ భవన్ లో సెట్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి మోడరన్ డాన్స్ పోటీలలో విష్ణు మణికంఠని ప్రథమ బహుమతి సాధించినట్లు కళాశాల  ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా ఆశాలతా పీటర్ తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నేపథ్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి.వీరయ్యచౌదరి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ డా. ఎన్.వి.రమణ, మెంబర్ కె. నాగేశ్వరరావు, తెలుగు విభాగాధిపతి డా. గుర్లింక ధర్మరాజు, డా. జి. జ్యోతిర్మయి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్దులు తోట నవీన్, నాని, జి.ధర్మేంద్ర, వీరాంజనేయులు, ఇ.విజయ్ కుమార్, తదితరులు ఆమెను అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us