గంగవరం,10 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): గిరిజనాభివృద్ధికి వైయస్ కుటుంబం కట్టుబడి ఉందని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ పి.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన అటవీ హక్కుల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో శనివారం వారు
ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నాడు హక్కుల గుర్తింపు చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వందలాది మంది గిరిజనులకు కొండపోడు పట్టాలు స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అందిస్తే నేడు తండ్రి బాటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలాది మంది గిరిజనులకు కొండపోడు భూములకు పట్టాలు అందిస్తున్న ఘనత దక్కిందన్నారు. రంపచోడవరం ఏజెన్సీ డివిజన్లో అర్హులైన 20 వేల మందికి 50 వేల ఎకరాలు కొండ పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల వారిని ఆదరిస్తూ అన్ని వర్గాలకు ఉపయోగపడే సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలు చేస్తూ సీఎం జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో 629 గ్రామపంచాయతీలు ఉండగా, ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతున్నట్లు చెప్పారు. ప్రతి వీధి వీధికి మంచినీటి కుళాయి ఏర్పాటు జరుగుతుందన్నారు. కోట్లాది రూపాయలతో రహదారులు అభివృద్ధి చేయడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలు తెలిసిన నేత జగన్మోహన్ రెడ్డి అని, ప్రజల అవసరాలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను ఆయన అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని ఆ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ సచివాలయ గ్రామ వాలంటీర్ ఈ వ్యవస్థను ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రభుత్వ పాలన ప్రజల వద్దకు తీసుకు వచ్చారన్నారు. ప్రజాసమస్యలు సత్వర పరిష్కారానికి తగిన కృషి చేయడం జరుగుతుందన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఏడు మండలాల్లో చింతూరు ఐటీడీఏ పరిధిలో నాలుగు మండలాల్లో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా 14 గ్రామాలకు చెందిన 69 మంది గిరిజనులకు అటవీ హక్కుల పట్టాలను వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాన్ మిల్టన్, ఆర్ఐ జిలాని. వీఆర్వోలు, మండల వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







