UPDATED 24th SEPTEMBER 2019 TUESDAY 5:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): స్పందన కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సుధా కాలనీలో గల ఎస్సీ బాలుర డిగ్రీ కళాశాలకు చెందిన హాస్టల్ ను ఆర్డీవో ఎస్. మల్లిబాబు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో శిథిలావస్థలో ఉన్న భవనం, శిథిలమైన మరుగుదొడ్లు, అలాగే విద్యార్థులకు అందించే ఆహారం సరియైన పద్దతిలో లేదని గమనించారు. హాస్టల్ మౌలిక వసతుల గురించి వార్డెన్ తో చర్చించారు. పూర్తిస్థాయిలో బడ్జెట్ రాని కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, భవనం మరమ్మత్తులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామని హాస్టల్ వార్డెన్ వి. కొండలరావు ఆర్డీవో కు తెలిపారు. మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆర్డీవో దృష్టికి తెచ్చారు. ఈ తనిఖీలో తెలుసుకున్న సమస్యలను జిల్లా కలెక్టర్ కు పంపడం జరుగుతుందని ఆర్డీవో తెలిపారు. ఈ తనిఖీలో ఆర్డీవో వెంట జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, తదితరులు ఉన్నారు.







