TS News: తెలంగాణలో హోంగార్డులకు గౌరవవేతనం పెంపు

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: తెలంగాణలోని హోంగార్డులకు గౌరవవేతనం పెరిగింది. వారి వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 2018 జులై నాటి గౌరవవేతనంపై 30శాతం పెంచారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల గౌరవవేతనాలు సవరించినప్పుడు హోంగార్డుల గౌరవవేతనం కూడా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us