కాకినాడ (రెడ్ బీ న్యూస్) 29 అక్టోబర్ 2021 : మూడు దశాబ్దాల అనుభవం.. వివిధ హోదాల్లో బాధ్యతలు.. అవే ఉప కులపతి హోదాను తెచ్చిపెట్టాయి. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే) అయిదో ఉప కులపతిగా డాక్టర్ జి.వి.ఆర్.ప్రసాదరాజును రాష్ట్ర గవర్నర్ నియమించారు. ప్రస్తుతం రెక్టార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసాదరాజు వీసీగా సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రసాదరాజు మాట్లాడుతూ.. జేఎన్‌టీయూకేను ఆదర్శ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. అపార అనుభవంతో విద్యాభివృద్ధిపై దృష్టిసారిస్తానని, న్యాక్ నుంచి మంచి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానన్నారు. మౌలిక సదుపాయాల మెరుగుకు చొరవ చూపుతాననీ..అందరి సహకారంతో సరికొత్త ఆలోచనలతో సాంకేతికాభివృద్ధి దిశగా విశ్వవిద్యాలయాన్ని తీసుకెళ్తానని తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







