పేదల మోములో చిరునవ్వులు చిందించడమే వైఎస్ఆర్ సిపి ధ్యేయం

UPDATED 9th JUNE 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: పేదల మోములో చిరునవ్వులు చిందించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. మాజీ కౌన్సిలర్ పితాని కృష్ణ అధ్యక్షతన స్థానిక జగ్గమ్మగారి పేట 23వ వార్డులో నిర్వహించిన నియోజకవర్గ పార్టీ బూత్ కమిటీ సమావేశానికి నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగేళ్ల ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యమని, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని, టిడిపి పాలనలో అభివృద్ధి శూన్యం అని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప బలంతో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగేస్తున్నారని, ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో అడ్డంకులన్నీ అధిగమిస్తూ మొక్కవోని దీక్షతో ముందుగు సాగుతున్నారన్నారు. నిత్యం ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ప్రజల్లో మమేకమై ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాదయాత్రను కొనసాగిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. పార్టీ  ప్రవేశపెట్టిన నవరత్న హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మీ నారాయణ, కంటే వీర్రాఘవులు, పార్టీ నాయకులు సేపేని సురేష్, మేకా శ్రీనివాస్, పితాని కృష్ణ, గంపా శివ, సారంపాటి లొవచారి, శెట్టిబత్తుల దుర్గ,  అధిక సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us