UPDATED 24th JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట-ద్వారపూడి కెనాల్ రోడ్డులో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులను లారీ బలంగా ఢీకొట్టడంతో మృతి చెందారు. సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాసనాయక్ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఆదిత్య కళాశాలకు చెందిన షేక్ అనీఫ్(22), షేక్ రబ్బానీ(21) గా సంఘటనా స్థలం వద్ద కళాశాలకు సంబంధించిన ఐడెంటీ కార్డులు లభ్యం కావడంతో మృతులను గుర్తించామని అన్నారు. అలాగే వీరిని ఢీకొన్న లారీ భారీ లోడుతో గోదావరి కాలువలోనికి దూసుకుపోయిందని, ఆ సమయంలో ఎదురుగా ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.







