UPDATED 2nd SEPTEMBER 2017 SATURDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో కొబ్బరి పరిశోధన క్షేత్రం (సీపీసీఆర్‌ఐ) ఏర్పాటుకు ఢిల్లీలోని ఏపీ భవన్ వ్యవహారాల కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ శనివారం ఈటీసీకి విచ్చేసి స్థలానికి సంబంధించి మ్యాప్‌లు పరిశీలించారు. సుమారు 50 ఎకరాల స్థలంలో కొబ్బరి పరిశోధన క్షేత్రం ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర బృందం సభ్యులు పరిశీలన చేశారు. అయితే ఈ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ప్రవీణ్‌ప్రకాష్ విచ్చేశారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, ఆర్డీవో రఘుబాబు, ఈటీసీ అధికారి రాంగోపాల్, తహసీల్దారు శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.







