UPDATED 19th MARCH 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్థికి ప్రజలు పట్టం కట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 7,8,9 వార్డుల్లో మంత్రి చినరాజప్ప మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం కష్టాల్లో ఉన్నా సరే అనుకున్నవి ఇచ్చి మాటను నిలబెట్టుకుంటూ అన్నీ అమలు చేసి ఇంటికి పెద్దకొడుకుగా మారారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే రోజులు వచ్చాయని, మీ భవిష్యత్తు మా బాధ్యత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని, పేదరిక నిర్మూలన కోసం దేశంలో ఎవ్వరూ చేయని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. మంత్రి ఇంటింటికి వెళ్లి పార్టీ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, పార్టీ నాయకులు కంటే జగదీష్ మోహన్, ముత్యాల రాజబ్బాయి, వల్లూరు శ్రీను, కుర్రా నారాయణస్వామి, బిక్కిన రాజశేఖర్, బడుగు శ్రీకాంత్, పడాల వీరబాబు, కాపవరపు కుమార్, పోలిపల్లి బాబీవర్ధన్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు







