UPDATED 8th OCTOBER 2018 MONDAY 8:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు సోమవారం వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజానగరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెత్తనుంచి సంపద తయారీ కేంద్రం వద్ద వివిధ రకాల పండ్ల జాతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎం ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి.డి. శివప్రసాద్ మాట్లాడుతూ మామిడి, సపోటా, నేరేడు, బత్తాయి మొక్కలు నాటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.







