మాస్కులు ధరించకుండా బయట సంచరిస్తే జరిమానా

* మున్సిపల్ కమీషనర్ గుంటూరు శేఖర్ 

UPDATED 23rd JUNE 2020 TUESDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): కోవిడ్-19 నియంత్రణలో భాగంగా బయట ప్రదేశాల్లో తిరిగేటపుడు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకపోతే జరిమానా తప్పదని పెద్దాపురం మున్సిపల్ కమీషనర్ గుంటూరు శేఖర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు మాస్కులు ధరించకుండా పట్టణంలో సంచరించే వ్యక్తులపై జరిమానాతో పాటు కోవిడ్-19 ప్రచారాన్ని ఒక గంటసేపు మాస్కు లేని వ్యక్తితో ప్రచారం చేయించడం జరుగుతుందని చెప్పారు. దీనికి భిన్నంగా వ్యవహరించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేయడం జరుగుతుందని, వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ వస్తువులు కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. వ్యాపార సంస్థలలో యజమానులతో పాటు పనిచేసే కార్మికులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్, సబ్బును తరచూ ఉపయోగించాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా రోడ్లపైన చెత్త వేయకుండా వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విచ్ఛలవిడిగా పట్టణాలలో తిరిగితే చర్యలు తప్పవని వెల్లడించారు. కరోనా కేసులను అరికట్టడానికి ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ వారి కుటుంబాన్ని, సమాజాన్ని కరోనా బారి నుంచి రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని, దీనికి పట్టణ ప్రజలందరూ మున్సిపల్, పోలీసు, రెవెన్యూ శాఖలకు పూర్తి సహకారం అందించాలని అన్నారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కమీషనర్ కోరారు.
                                        

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us