ఘనంగా నవోదయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

UPDATED 2nd DECEMBER 2018 SUNDAY 8:00 PM 

పెద్దాపురం: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. మునిరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పలకరించుకొంటూ ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మునిరామయ్య మాట్లాడుతూ నవోదయ విద్యాలయ సమితి (హైదరాబాద్) ఆదేశాల మేరకు ప్రతీ సంవత్సరం డిసెంబర్ నెల మొదటి ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవోదయాలో విద్యను అభ్యసించిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని, తాము విద్యను అభ్యసించిన విద్యాలయంపై మక్కువతో ఈ సమ్మేళనానికి హాజరైన విద్యార్థులు అభినందనీయులని అన్నారు. విద్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనేక ఆధునిక వసతులు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సమ్మేళనంలో 1993 నుంచి 2000వ సంవత్సరం వరకు విద్యను అభ్యసించిన ఏడవ బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ నిర్వహించారు. ఆ బ్యాచ్ కు చెందిన జయవర్ధన్, కమలకిరణ్ సారథ్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు ప్రొఫెసర్ రాజశేఖర్, శాస్త్రవేత్త అనిల్, డాక్టర్ మూర్తి, మాస్టర్ జగన్నాధం, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రదీప్ తదితరులు ప్రస్తుత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. అలాగే విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు ప్రిన్సిపాల్ డాక్టర్ మునిరామయ్య, సీనియర్ ఉపాధ్యాయులు ఎ. రఘు, పి. రామారావు, తదితరులను సిల్వర్ జూబ్లీ విద్యార్థులు దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.                      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us