UPDATED 30th APRIL 2018 MONDAY 7:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాలలో ఫైనల్ ఇయర్ బి.టెక్ సి.ఎస్.సి విద్యార్థులు ఎస్. వీరేంద్ర, ఎన్.జి.ఎల్. నారాయణ నూతనంగా ప్రారంభించిన ఎక్స్ లెంట్ సోలుషన్స్ అనే స్టార్టప్ సంస్థను గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు తెలియచేసి వారిని అభినందించారు. ఎక్స్ లెంట్ సోలుషన్స్ సంస్థ నిర్వాహకులు వీరేంద్ర, నారాయణ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మరికొంత మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో తాము దీనిని ప్రారంభించామని, దీని ద్వారా ఇంజనీరింగ్ కళాశాలల్లో సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహించి విద్యార్థులకు సాఫ్ట్ వేర్ రంగంలో వస్తున్న అధునాతన మార్పులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.జి.కె. జగన్నాధ రాజు, సి.ఎస్.సి. విభాగాధిపతి డాక్టర్ బి.సుజాత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.







