నవరత్నాలతో ప్రతీ కుటుంబానికీ మేలు

UPDATED 25th NOVERMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలతో రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుందని పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని పివేమవరం నుంచి 200 మంది కార్యకర్తలు ఎలిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో దొరబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కంటే మెరుగైన పాలన అందించే సత్తా ఉన్న జగన్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ  కార్యకర్త జగన్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేయాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి  ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా, రాజన్న రాజ్యం రావాలన్నా జగన్ మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దవులూరి సుబ్బారావు, కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటఅప్పారావు చౌదరి, మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు, గోపు మురళి, పుట్టా సూరిబాబు, పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, కొండపల్లి విష్ణుమూర్తి, బుర్రా లక్ష్మయ్య, తుమ్మలపల్లి రాజబ్బాయి, తోట చిట్టిబాబు, అత్తిలి దివాకర్, ఎలిశెట్టి సూరిబాబు, పడాల దొర, నూతలపాటి సమర్పణరావు, కొత్త వీరబాబు, గండేపూడి అన్నవరం, కీర్తి ఆర్య, యాళ్ల శ్రీను, మోగిళ్ళ కొండలరావు, దమ్మల చక్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us